- Advertisement -
నెతన్యాహు మాజీ సన్నిహితుని వెల్లడి
జెరూసలెం : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాజీ సన్నిహితుడు, మితవాది నఫ్తలి బెన్నెట్ తరువాతి ప్రధానిని తానే అని సిఫార్సు చేసుకోవడం ఇజ్రాయెల్ రాజకీయ ప్రతిష్టంభనను మరింత అగాధం లోకి నెట్టింది. తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు ఇజ్రాయెల్ అధ్యక్షునితో సోమవారం చర్చించడానికి నఫ్తలి బెన్నెట్‌ను ఆయన స్వంత యమీనా పార్టీ నియమించింది. నెతన్యాహు మద్దతుదారులకు, ప్రత్యర్థులకు మధ్య కింగ్‌మేకర్‌గా వ్యవహరించే స్థాయిలో యమీనా పార్టీ ఉంది. అయితే దానికి బదులుగా ఆ పార్టీ ఏ పక్షం వహించడానికి ఇష్టపడడం లేదు. పార్లమెంట్‌లో యమీనా పార్టీకి కేవలం ఏడు సీట్లు ఉన్నాయి. అయితే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రత్యర్థి వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించ గలనని, అందరికీ ఆమోద యోగ్యమైన అభ్యర్థిని కాగలనని బెన్నెట్ ఆశిస్తున్నారు.
- Advertisement -