Thursday, January 23, 2025

‘కల్కి పార్ట్ 2’ ఇంకా ఫన్‌గా ఉంటుంది: నాగ్ అశ్విన్

- Advertisement -
- Advertisement -

విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 ఎడి’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఎడి’ ఇటీవ గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులని మహా అద్భుతంగా అలరించి, ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

ఈ నేపధ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంకరపల్లిలోని కల్కి సెట్స్ లో గ్రాండ్‌గా జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ.. “కల్కి సినిమా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని అందరూ చెబుతుండడంతో ఆనందంగా వుంది. తెలుగు సినిమా అంటే మనకి గుర్తుకొచ్చేది మాయాబజార్. మాయాబజార్ మహాభారతంకి ఒక అడాప్ట్టేషన్. ఆ సినిమాలోని సన్నివేశాలు మహాభారతంలో ఎక్కడా లేవు. అదొక క్రియేటివ్ ఫిక్షన్. అక్కడి నుంచే కల్కి సినిమాకు ప్రేరణ వచ్చింది. -ముందుగా ఒక్క సినిమాగానే ఈ కథను తెరకెక్కించాలనుకున్నా. కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద స్టోరీని ఒక్క భాగంలో చెప్పడం ఛాలెంజ్ అనిపించింది. అప్పుడే పార్ట్‌లుగా చూపించాలని నిర్ణయించుకున్నా. పార్ట్ 2కి సంబంధించిన 20 రోజులు షూట్ చేశాం. ఇంకా చాలా చేయాలి. చాలా యాక్షన్, బ్యాక్ స్టోరీస్, న్యూ వరల్డ్… ఇలా చాలా వున్నాయి. అవన్నీ ఇప్పుడు క్రియేట్ చేయాలి.

కల్కిలోని కథ, పాత్రలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అమితాబ్, కమల్, ప్రభాస్, దీపిక లాంటి పెద్ద యాక్టర్స్ ని తీసుకోవడం జరిగింది. ప్రభాస్‌ని క్లైమాస్క్‌లో కర్ణుడిగా చూపించడం జరిగింది. కర్ణుడి పాత్ర పాజిటివ్ గానే వుంటుంది. ఇండియాలో ఎక్కడ చూసిన ఆ క్యారెక్టర్‌ని లవ్ చేస్తారు. ప్రభాస్‌కి ఈ కథ చెప్పినప్పుడు సినిమాపై ఎంతో ఆసక్తి చూపించారు. ఈ ప్రాజెక్ట్‌ని ఆయన చాలా నమ్మి చేశారు. కల్కి మాసీవ్ సబ్జెక్ట్, పార్ట్ 1లో ఎవరి పాత్రలు, బలాలు, ఉద్దేశ్యాలు ఏమిటో తెలిసిపోయాయి. కల్కి పార్ట్ 2 ఇంకా ఫన్‌గా ఉంటుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News