Thursday, January 23, 2025

ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్

- Advertisement -
- Advertisement -

యదార్థ సంఘటనల ఆధారంగా, రియల్ లొకేషన్‌లలో రూపొందించే చిత్రాలకు ప్రీ-ప్రొడక్షన్ చాలా ముఖ్యం. నాగ చైతన్య 23వ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం కొత్త విధానాన్ని అనుసరించారు.

ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించడానికి, సినిమా టీం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పర్యటించింది. శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ ఈ గ్రామానికి వచ్చి ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత మా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైందని అన్నారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ పాత్రలన్నింటిని కలసి, వారి బాడీ లాంగ్వేజ్, పల్లె పరిస్థితులు, వారి జీవనశైలిని అర్ధం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఈ మొత్తం ప్రయాణాన్ని ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్ అనే డాక్యుమెంటరీగా చూపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News