Wednesday, January 22, 2025

‘హే సినామిక’తో ప్రేమలో పడతారు

- Advertisement -
- Advertisement -

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హే సినామిక’. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. జియో స్టూడియోస్, గోబల్ వన్ స్టూడియోస్ పతాకాలపై ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, జగపతి బాబు, సురేష్ బాబు, అదితిరావు హైదరి, బృంద మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ “బృంద మాస్టర్ కొరియోగ్రాఫీకి నేను పెద్ద ఫ్యాన్‌ని. నాకు దుల్కర్‌తో మంచి అనుబంధం ఉంది. దుల్కర్, నేను యాక్టర్స్ అవుతామని అనుకోలేదు. కానీ ఇప్పుడు యాక్టర్స్‌గా మారి స్టేజ్‌పై నిలబడి ఉన్నాం. అదితి ఏ పాత్ర చేసినా అందులో ఓ కొత్తదనం ఉంటుంది. ట్రైలర్ చాలా బావుంది”అని అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “ఓ యాక్టర్‌గా నన్ను సాంగ్స్‌లో రొమాంటిక్‌గా చూపించడంలో కొరియోగ్రాఫర్‌గా బృంద మాస్టర్ పాత్ర ఎంతో ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాతో ప్రేమలో పడతారు. ఎమోషనల్ అవుతారు. డాన్స్ చేస్తారు”అని తెలిపారు. డైరెక్టర్ బృంద మాస్టర్ మాట్లాడుతూ “దుల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తను కథ వినగానే వెంటనే ఓకే చెప్పేసి ఎంతగానో సపోర్ట్ అందించాడు”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News