Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కొన్న నాగ చైతన్య!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇల్లు కట్టుకుని అందులోకి ప్రవేశించడం ఇచ్చినంత అనుభూతి మరేది ఇవ్వదు. ఇప్పుడలాంటి ఆనందాన్నే నటుడు నాగచైతన్య అనుభవిస్తున్నాడు. తమ కుటుంబానికి దగ్గరలోనే ఈ కొత్త ఇల్లును నాగచైతన్య కొనుకున్నాడు. అది అతడి అభిరుచి, స్టయిల్‌కు తగినట్లు ఉంటుంది.

నాగచైతన్య తన భార్య సమంతకు విడాకులు ఇవ్వక ముందు జూబ్లీహిల్స్‌లో నివసించేవాడు. వారు విడిపోయాక నాగచైతన్య కొన్ని నెలలపాటు తన తండ్రి ఇంట్లో ఉన్నాడు. తర్వాత ఫైవ్‌స్టార్ హోటల్‌కు మారాడు. ఇప్పుడతడు తనదైన ఇంటిని కొనుకున్నాడు. తన వస్తువులన్నీ తీసుకుని అతడిప్పుడు తన కొత్త ఇంటికి మారాడని సమాచారం.

ఇక తన వృత్తిపరంగా నాగచైతన్య తన తాజా చిత్రం ‘కస్టడీ’ విడుదలకు సన్నద్ధమవుతున్నాడు. ఆ చిత్రంలో నాగచైతన్య ఓ పోలీసు ఆఫీసరు పాత్రను పోషించాడు. అతడికి జతగా కృతి శెట్టి నటించింది. ఆ సినిమా టీజర్ కోసం అతడి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టీజర్ విడుదలవుతే ప్లాట్, కేరెక్టర్లు, సన్నివేశాలు ఎలా ఉంటాయన్నది కొంత మేరకు తెలియగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News