Monday, January 20, 2025

ఇరానీ చాయ్‌తో చై.. కస్టడీ ప్రమోషన్స్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: హైదరాబాద్‌వాసులకు నీలోఫర్ చాయ్ రుచి తెలియంది కాదు..సామాన్యుల నుంచి సినిమా స్టార్ల వరకు నీలోఫర్ చాయ్ అంటే పడి చస్తారంటే అతిశయోక్తి కాదు. ఇందుకు సాక్షం మీరు చూస్తున్న ఈ ఫోటోనే. యంగ్ హీరో నాగ చైతన్య తాహైదరాబాద్‌లోని నీలోఫర్ రెస్టారెంట్ చాయ్ తాగుతూ కనిపించారు.

దర్శకుడు వెంకట్ ప్రభుతో కలసి చై రెస్టారెంట్‌కు వచ్చారు. వారిద్దరి కలయికలో వస్తున్న కస్టడీ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఈ దృశ్యం కనిపించింది. చై చాయ్ కప్పుతో ఫోటోకు పోజిస్తుందగా వెంకట్ ప్రభు తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ క్లిక్ చేశారు. ఈ ఫోటోను చాయ్ విత్ చై క్యాప్షన్‌తో కస్టడీ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతకుముందు నాగ చైతన్య నగరంలోని ప్రముఖ కేఫ్ 555 సందర్శించి నోరూరించే హలీంని కూడా టేస్ట్ చేశారు.

కాగా..వెంకట్ ప్రభు తెలుగులో దర్శకత్వం వహిస్తున్న తొలి స్ట్రయిట్ చిత్రం. గతంలో శింబూ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన మానాడు హిట్ చిత్రంగా నిలిచింది. కస్డడీలో శరత్‌కుమార్, అరవింద్ స్వామి, కృతిశెట్టి నటిస్తుండగా ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News