Monday, December 23, 2024

‘థాంక్యూ’ ఛాలెంజింగ్ సినిమా..

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగచైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగ చైతన్యతో ఇంటర్వూ విశేషాలు…
ఛాలెంజింగ్ సినిమా…
థాంక్యూ సినిమా నాకు ఫిజికల్‌గా, మెంటల్‌గా ఛాలెంజింగ్ సినిమా. అందరికీ ఇందులో మూడు షేడ్స్‌లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. 16 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లు, 36 ఏళ్లు… ఇలా రకరకాల దశలను చూపించాం. ‘థాంక్యూ’ లాంటి స్క్రిప్ట్ దొరకడం చాలా కష్టం.
ఎలా ప్రభావం చెందాడని చూపించారు..
‘ప్రేమమ్’లో నేను చేసింది… మనిషి జీవితంలో లవ్‌స్టోరీస్ వల్ల ఎలా ప్రభావితం అవుతాడు అనే క్యారెక్టర్. కానీ ఈ సినిమాలో ఒక వ్యక్తి జీవితంలో కలిసే వ్యక్తుల వల్ల ఎలా ప్రభావం చెందాడు అనేది చూపించారు. – సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు 70 శాతం దాకా విదేశాల్లోనే చేశాం. కొంత భాగం రాజమండ్రి, వైజాగ్ పరిసరాల్లో షూట్ చేయడం జరిగింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశా…
ఈ సినిమా కోసం చాలానే తగ్గాను. ఈ సినిమా కన్నా ముందే ‘లాల్‌సింగ్ చద్దా’ కోసం 25 కిలోలు తగ్గాను. అది ఈ సినిమాకు చాలా బాగా ఉపయోగపడింది. ఇక బ్యాక్ టు బ్యాక్ లవ్‌స్టోరీ, థాంక్యూ, ధూత అన్నీ చేసేశా. ఇవన్నీ కోవిడ్ ముందే చేయాల్సింది. కానీ కోవిడ్ వల్ల కుదరలేదు.
చాలా బాగా డీల్ చేస్తారు…
థాంక్యూ మూవీలో అభిరామ్ జర్నీ గురించి విక్రమ్, రవి, దిల్‌రాజు వచ్చి చెప్పినప్పుడు నాకు ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. విక్రమ్ సెన్సిబుల్ విషయాలను చాలా బాగా డీల్ చేస్తారు. దిల్‌రాజుతో 12 ఏళ్ల తర్వాత సినిమా చేశాను. ఇంతకు ముందు కూడా ఆయన కాంపౌండ్ నుంచి చాలా కథలు విన్నా. కానీ ఈ సినిమా తప్పక చేయాలనిపించింది.
నేను చాలా మారాను…
థాంక్యూ సినిమాతో వ్యక్తిగా నేను కూడా చాలా మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలను సగమే బయటకు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యాను. చాలా బాగా వాళ్లతో కలిసిపోతున్నాను.
తన వల్లే ప్రయాణం మొదలు…
ఈ సినిమాలో రాశీ ఖన్నా రోల్ చాలా కీలకం. తన వల్లే హీరో ప్రయాణం మొదలవుతుంది. అలాగే మాళవికా నాయర్ పాత్ర కూడా బావుంటుంది. అవికా గోర్ పాత్ర హీరోయిన్‌లా కాకుండా సోదరిలా ఉంటుంది.
తదుపరి చిత్రాలు…
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నేను చేస్తోన్న సినిమాలో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. నా స్టైల్లో సాగే మాస్ కమర్షియల్ మూవీ అది. సెన్సిబుల్ ఇంటెలిజెంట్ మూవీ ఇది. తరుణ్ భాస్కర్ కూడా మంచి పాయింట్ చెప్పాడు. అది కూడా చర్చల్లో ఉంది. దర్శకుడు పరుశురామ్ సినిమా స్టోరి ఇంకా లాక్ కాలేదు. ఓ పాయింట్ అనుకున్నాం.

Naga Chaitanya Interview about ‘Thank You’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News