Monday, December 23, 2024

విడాకులపై నోరు విప్పిన నాగచైతన్య

- Advertisement -
- Advertisement -

 

Naga Chaitanya

హైదరాబాద్: సమంత, నాగ చైతన్య ప్రేమించుకుని పెళ్లిచేసుకుని నాలుగేళ్లు కాపురం చేశాక గత ఏడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే విడాకులు తీసుకునేందుకు ఎలాంటి కారణాలు వారు వెళ్లడించలేదు. ఇది జరిగి దాదాపు ఏడాది కావొస్తోంది. వాళ్లు కాపురం చేసిన ఇల్లును కూడా సమంత కొనేసిందని వార్త. కాగా ఇటీవల ‘కాఫీ విత్ కరణ్ 7 ’ మూడో ఎపిసోడ్‌లో సమంత తమ విడాకుల గురించి నోరు విప్పింది. “విడాకులు తీసుకోవడం కష్టంగానే ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగానే ఉంది, నేను మరింత స్ట్రాంగ్‌గా తయారు అయ్యాను” అంది. “ఒకవేళ మమ్మల్ని ఒకే గదిలో ఉంచినట్లయితే కొసదేలిన వస్తువులను దాపెట్టాయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మా మధ్య సామరస్యం లేదు” అని చెప్పింది. తాను నాగచైతన్య నుంచి భరణంగా రూ. 250 కోట్లు తీసుకున్నట్లు వచ్చిన వదంతులపై కూడా ఆమె స్పందించింది.“ ఒకవేళ అదే నిజమైతే,  తన ఇంటికి ఏ రోజైనా ఆదాయపు పన్ను శాఖ వారు దాడిచేసేయొచ్చు. అదంతా ఉత్తి పుకారు మాత్రమే” అని కొట్టిపారేసింది.

ఇదిలావుంటే, ఇప్పుడు నాగచైతన్య కూడా తమ విడాకులపై తన నోరు విప్పాడు. ‘లాల్ ఛద్దా’ సినిమా ప్రమోషన్ సందర్భంగా తన మనస్సులో మాట చెప్పాడు. సమంతపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందన్నాడు. తామిద్దరం ఓ ఏకాభిప్రాయానికి వచ్చే విడిపోయామన్నాడు. కానీ తమ మధ్య ఏదో జరిగి ఉంటుందనే అభిప్రాయం ప్రచారంలో ఉందన్నాడు. సమంత నుంచి విడిపోవడం అన్నది తనకు ఓ గడ్డు కాలమన్నాడు. అయితే తాను ఆ గడ్డు పరిస్థితిని దాటానని, ఇప్పుడు తన కుటుంబానికి, స్నేహితులకు మరింత దగ్గరగా ఉంటున్నానని తెలిపాడు. పరిస్థితులు చాలా మార్పులు తెచ్చి తనను ఓ కొత్త మనిషిగా మార్చేశాయన్నాడు. ఇదివరకైతే నేను దీనిపై ఎక్కువ ప్రతిస్పందించేవాడిని కాదు, కానీ ఇప్పుడు ఓ మారిన మనిషిగా ప్రతిస్పందిస్తున్నాను అని తెలిపాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News