టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ‘మజిలీ’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాక అతడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ చేశాడు. ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడింది. తొందర్లోనే థియేటర్లలోకి రానుంది ఈ సినిమా. తదుపరి నాగచైతన్య బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో చైతన్య హిందీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కథానాయకుడు. చైతూ, అమీర్‌లపై కీలక సన్నివేశాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం నాగచైతన్య తన భాగాన్ని పూర్తి చేశాడు. చైతన్య పాత్ర ఇందులో ఎంతో ఎమోషనల్‌గా సాగుతుందని… అతడి పాత్ర చనిపోతుందని తెలిసింది. అమీర్‌తో పాటు చైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడు.
అయితే యుద్ధంలో చనిపోయిన యువ సైనికుడిగా చైతన్య కనిపిస్తాడు. అతడి తల్లిదండ్రులను ఓదార్చేందుకు కాకినాడకు చేరుకుంటాడు అమీర్ ఖాన్. అందుకు సంబంధించిన సన్నివేశాలను ఇంతకుముందు తెరకెక్కించారు. అమీర్ తన హోమ్ ప్రొడక్షన్‌లో ఈ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సినిమా ఆద్యంతం ఎమోషన్ రగిలించే పాత్రతో అమీర్ ఖాన్ కనిపిస్తాడు. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఫారెస్ట్ గంప్’కి అధికారిక రీమేక్ చిత్రమిది.
Naga Chaitanya play emotional role in Laal Singh Chaddha