హైదరాబాద్: ‘లవ్ స్టోరీ’ మూవీ షూటింగ్ పూర్తి చేసిన అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైయ్యాడు. స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’లో చైతన్య ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. లాక్ డౌన్ తర్వాత ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో షూటింగ్స్ ప్రారంభయ్యాయి. ఈ క్రమంలో ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ లడఖ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో అమీర్ ఖాన్ తోపాటు చైతన్య కూడా జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా లోకేషన్ లో దిగిన స్టిల్ ను చైతన్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. స్టిల్ లో అమీర్‌ఖాన్, చైతన్య ఇద్దరూ ఆర్మీ డ్రెస్సుల్లో ఉన్నారు. వీరితోపాటు డైరెక్టర్ అద్వైత్ చందన్, అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Grateful #Bala #LaalSinghChaddha pic.twitter.com/hLidCDCcyf
— chaitanya akkineni (@chay_akkineni) July 9, 2021
Naga Chaitanya shares a still from ‘Laal Singh Chaddha’ Sets