- Advertisement -
హీరో అక్కినేని నాగచైతన్య సినిమాలకు సంబంధించి మాత్రమే సోషల్ మీడియాలో అప్‌డేట్‌లు ఇస్తుంటారు.వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ షేర్ చేయలేదు. సమంతతో విడాకులు తీసుకున్న 45 రోజుల తర్వాత ఆయన సోషల్ మీడియాలో తొలి పోస్ట్ పెట్టారు. శనివారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో హాలీవుడ్ నటుడు మాథ్యూ మెకన్‌హే రచించిన ‘గ్రీన్ లైట్స్’ అనే ఆటో బయోగ్రఫీపై స్పందిస్తూ… ‘జీవితానికి ప్రేమ లేఖ.. గ్రీన్‌లైట్స్’ అని అభిప్రాయపడ్డారు. రచయిత మాథ్యూని ట్యాగ్ చేస్తూ.. “మీ ఆత్మకథని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. జీవితంలో ముందుకు వెళ్లేందుకు నాకు ఈ పుస్తకం ఉపయోగపడింది” అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
Naga Chaitanya shares insta post after divorce
- Advertisement -