Thursday, December 26, 2024

నాగ చైతన్య, శోభిత పెళ్లి డేట్ ఫిక్స్!

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నాగచైతన్య, శోభితను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయంపై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ 4న చై, శోభిత పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. కాగా, శోభిత ఇంట్లోనూ పసుపు దంచే కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని శోభిత పసుపు దంచే ఫోటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా? హైదరాబాద్‌లోనే చేసుకుంటారా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News