Wednesday, December 4, 2024

అన్నపూర్ణ స్టూడియోలో చైతన్య-శోభిత పెళ్లి..

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం మంగళవారం రాత్రి 8.13 గంటలకు జరగనుంది. ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేక పెళ్లి సెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగనుంది. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధువులతోపాటు పలువురు సినీ, రాజకీయా ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరవుతారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరగ్గా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. కాగా, సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య, శోభితాతో డేటింగ్ చేశారు. వీరిద్దరూ ఒకరికొకరూ అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News