Thursday, December 12, 2024

చైతన్య-శోభిత పెళ్లి వీడియో వైరల్..

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో బుధవారం రాత్రి 8.13 గంటలకు ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, బంధువులతోపాటు పలువురు సినీ, రాజకీయా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి ఫోటోలను హీరో నాగార్జున ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ పెళ్లి ఫోటోలతోపాటు నాగచైతన్య.. శోభిత మెడలో తాళి కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య, శోభితాతో డేటింగ్ చేశారు. వీరిద్దరూ ఒకరికొకరూ అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని గత నెలలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News