Monday, January 20, 2025

ఈ నెలలోనే సెట్స్‌పైకి ద్విభాషా చిత్రం

- Advertisement -
- Advertisement -

హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవల థాంక్యూ, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రాలలో కనిపించాడు. రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. అయితే నాగచైతన్య దర్శకుడు వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం చైతూ కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రంగా రూపొందుతోందని తెలిసింది. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయిక. ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇందులో చైతన్య మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించనున్నాడు. నాగచైతన్యకు ఇది మొదటి తమిళ చిత్రం కాగా దర్శకుడికి ఇది మొదటి తెలుగు చిత్రం. శ్రీనివాస చుట్టూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. అబ్బూరి రవి డైలాగ్ రైటర్.

Naga Chaitanya’s bilingual Film Shoot Start Soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News