Monday, January 20, 2025

కీలక సన్నివేశాల చిత్రీకరణలో…

- Advertisement -
- Advertisement -

హీరో అక్కినేని నాగచైతన్య, దర్శకుడు వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ’కస్టడీ’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. టీమ్ శుక్రవారం చివరి షెడ్యూల్ షూట్‌ని ప్రారంభించింది. ప్రధాన నటీనటులందరూ పాల్గొంటున్న ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్‌లో కనిపించిన ‘కస్టడీ గ్లింప్స్’ న్యూ ఇయర్ కానుకగా విడుదలైంది. ఈ టీజర్‌లో టెక్నికల్ బ్రిలియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీజర్‌లో నాగ చైతన్య విలన్‌లపై పంచ్‌లు, కిక్‌లు ఇస్తూ యాక్షన్‌లోకి దిగడం ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ‘కస్టడీ’ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘కస్టడీ’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News