Monday, January 20, 2025

డిసెంబర్ 1న నాగ చైతన్య ‘ధూత’ వెబ్ సిరీస్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో భారీ ప్రాజెక్టు చేస్తూ బిజీగా ఉన్న యువ సామ్రాట్ నాగచైతన్య.. ప్రస్తుతం తాను నటించిన ఓ వెబ్ సరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు ఒరిజినల్ సూపర్‌ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ధూత’ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య నటించిన విషయం తెసిందే. ఈ సిరిస్ కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు.  నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించారు. తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్..విడుదల తేదీని ప్రకటించింది.

ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో సక్సెస్ ఫుల్ జర్నలిస్ట్ సాగర్ గా చైతన్య నటిస్తున్నారు. పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థ్రిల్లర్ డ్రామా రూపొందించిన ఈ సిరీస్.. ప్రైమ్ వీడియోలో,  ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలులో డిసెంబర్ 1న ప్రసారం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News