Monday, December 23, 2024

అయోధ్య హనుమాన్‌ గర్హి ఆలయంలో నాగసాధు హత్య

- Advertisement -
- Advertisement -

అయోధ్య( యుపి) : అయోధ్య లోని ప్రఖ్యాత హనుమాన్‌గర్హి ఆలయ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం నాగసాధు( 44 ) హత్యకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితుల్లో ఒకరిని పోలీస్‌లు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. మృతుడు నాగసాధు పేరు రామ్‌సహారే దాస్. దుండగులు ఆయన గొంతుకోసి హత్య చేశారు. ఆలయ ప్రాంగణంలో నివసిస్తుండే వ్యక్తికి ఈ నేరంతో సంబంధం ఉన్నట్టు పోలీస్‌లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు. హనుమాన్‌గర్హి ప్రధాన పూజారీ రాజుదాస్ మృతుడు సాధు 1991 నుంచి హనుమాన్‌గర్హి ఆలయంలోని ఆశ్రమంలో ఉంటున్నాడని, పదిమంది విద్యార్థులకు ఆధ్యాత్మిక బోధన చేస్తుంటాడని చెప్పారు. ఈ హత్యా సంఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News