- Advertisement -
న్యూస్‌డెస్క్: కుంభమేళా తర్వాత అతి పెద్ద మేళాగా భావించే గంగాసాగర్‌లో లక్షలాది మంది భక్తులు శనివారం పవిత్ర స్నానాలు ఆచరించారు. మకర సంక్రమణాన్ని పురస్కరించుకుని కోల్‌కతాలోని బాపూ ఘాట్‌లో నాగ సాధువులతోసహా లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గంగాసాగర్‌లో పుణ్య స్నానాలు ఆచరించడానికి వేలాది కిలోమీటర్ల నుంచి వచ్చిన నాగ సాధువులను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిని కనబరిచారు.
ఆదివారం సంక్రాంతి పర్వదినాన తాము గంగాసాగర్ నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తామని, అనంతరం ఉజయ్యయినికి తిరుగుప్రయాణమవుతామని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక నాగ సాధువు విలేకరులకు తెలిపారు. బాపూబూఘాట్‌ను పవిత్ర స్నానాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గాంగాసాగర్ నది బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ప్రవహిస్తుంది.
- Advertisement -