Wednesday, January 22, 2025

నాగశౌర్య కొత్త సినిమా షూటింగ్ షురూ..

- Advertisement -
- Advertisement -

హీరో నాగశౌర్య తన నూతన చిత్రాన్ని ప్రకటించారు. డెబ్యుటెంట్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. డైరెక్టర్ రమేష్ ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌదరి, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశారు.

అనేక విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా పనిచేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్‌లతో సహా ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News