Sunday, December 22, 2024

ఓ ఇంటివాడు కానున్న నాగశౌర్య

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో నాగశౌర్య త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈనెల 20న ఉదయం 11.25 గం.లకు ఇంటీరియర్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్న అనూష శెట్టితో బెంగళూరులోని జెడబ్లు మారియట్ హోటల్‌లో శౌర్య వివాహం వైభవంగా జరుగనుంది. కాగా ఈనెల 19న ప్రీ వెడ్డింగ్ మెహంది ఫంక్షన్ జరుగనుంది.

అయితే, రెండు వేడుకలకు ప్రత్యేకంగా విడివిడిగా స్పెషల్ డ్రెస్‌లు డిజైన్ చేశారు. ఇక నాగశౌర్య, అనూషలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. నాగశౌర్య వివాహ వార్త విని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఆయనకు ముందస్తు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక నాగశౌర్య ఇటీవల ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీతో మంచి సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుని కెరీర్ పరంగా మంచి జోష్ మీదున్నారు.

Naga Shourya to get married Anusha Shetty

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News