Wednesday, January 22, 2025

ప్రత్యేక రాష్ట్రం కోసం నాగా విద్యార్థుల పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

Naga students walkthon for separate state

కోహిమ: ప్రత్యేక ఫ్రాంటియర్ నాగాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటును చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతూ తూర్పు నాగా విద్యార్థుల సమాఖ్య(ఇఎన్‌ఎస్‌ఎఫ్) శుక్రవారం రాష్ట్రంలోని ఆరు తూర్పు జిల్లాలలో పాదయాత్ర చేపట్టింది. మరో నాలుగు నెలల్లో నాగాల్యాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల సమాఖ్య ఈ డిమాండును ప్రధాని మోడీ దృష్టికి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని ఆరు తూర్పు జిల్లాలైన తుయెన్‌సంగ్, మోన్, లాంగ్‌లెంగ్, కిఫిరె, నోక్‌లక్, షమాటోర్ జనాభా మొత్తం రాష్ట్ర జనాభాలో 48 శాతం ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 60 స్థానాలలో 20 స్థానాలు ఈ ఆరుజిల్లాలలో ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడి 59 సంవత్సరాలు గడిచినా ఈ సరిహద్దు జిల్లాలు ప్రభుత్వాల నిర్లక్ష్యాల ఫలితంగా అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని ఈ ఆరు జిల్లాలో డిప్యుటీ కమిషనర్లకు సమర్పించిన ఐదు అంశాల వినతిపత్రంలో విద్యార్థుల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. తాము కోరుతున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండును తక్షణమే, సానుకూలంగా పరిశీలించాలని ఏడు సంఘాలతో కూడిన ఇఎన్‌ఎస్‌ఎఫ్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. తూర్పు నాగాల్యాండ్ ప్రాంతంలో విద్య, ఆరోగ్య, ఆర్థిక రంగాలకు సంబంధించి కనీస మౌలిక సౌకర్యాలు కూడా లేవని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News