Friday, November 22, 2024

పొత్తుల తర్వాతే పోటీపై నిర్ణయం: నాగబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పొత్తులపై జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జనసైనికులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసిపిపై విమర్శలు చేశారు. వైసిపి కూడా ఒక పార్టీయేనా అని వ్యాఖ్యానించారు. దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం కలిస్తే వైసిపి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో జనసేన పొత్తు పక్కా అనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

దీనిపై నాగబాబు స్పందిస్తూ పొత్తులు ఎవరితో ఉంటాయనే విషయాన్ని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని చెప్పారు. పొత్తులు కుదిరిన తర్వాతే ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొత్తుల విషయంలో ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని పవన్ ప్రకటిస్తారని చెప్పారు. పొత్తులు కుదరక ముందే పోటీ చేయబోయే స్థానాలపై మాట్లాడటం అనవసరమన్నారు. జనసైనీకులు, వీర మహిళల నుంచి సమస్యలను తెలుసుకోడానికే తాను కర్నూలుకు వచ్చానన్నారు. కర్నూలులో జనసేన నేతలు, కార్యకర్తలతో నాగబాబు చర్చలు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News