Monday, April 7, 2025

నాగబాబుకు చిరంజీవి అభినందనలు

- Advertisement -
- Advertisement -

మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరు.. తన తమ్ముడికి పూల దండ వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో చిరంజీవి.. అభిమానులతో పంచుకున్నారు. అంతకుముందు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును జనసేన ఎమ్మెల్సీ నాగబాబు భార్యతో సహా కలిశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అనంతరం సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబును శాలువా కప్పి సీఎం సత్కరించారు.

కాగా.. ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసేన నేత కొణిదల నాగబాబు, బీజేపీ నేత సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరు నేతలతో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News