- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేస్తూ.. నాగబాబును నామినేషన్ వేయాల్సిందిగా సూచించారు. కాగా, రాజ్యసభ స్థానాల్లో రెండింటిని తెలుగుదేశం, ఒక సీటుని బిజెపి తీసుకున్నాయి. ఈ సందర్భంగా నాగబాబుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో ఆయనకు కోసం కేటాయించారు. అయితే శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నాగబాబుకు కార్పొరేషన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి నాగబాబును నామినేట్ చేయడంతో ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉంది.
- Advertisement -