Saturday, February 22, 2025

అదిరిపోయే డ్యాన్స్ సాంగ్

- Advertisement -
- Advertisement -

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి నిర్మాతగా ఎన్‌ఐకె స్టూడియోస్ ఇన్ అసోసియేషన్ విత్ అభిషేక్ పిక్చర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘నాగబంధం’. ఈ సినిమా భారీ సెట్‌లో హీరో విరాట్ కర్ణ, హీరోయిన్స్ నభా నటేష్, ఐశ్వర్యమీనన్‌పై గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో అదిరిపోయే డ్యాన్స్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.

హీరో విరాట్ కర్ణ, హీరోయిన్స్ నభా నష్, ఐశ్వర్య మీనన్‌పై ఓ గ్రాండ్ సాంగ్‌ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఓ భారీ సెట్ నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ అభే ఓ బ్లాక్ బస్టర్ నెంబర్‌ను కంపోజ్ చేశారు. కాలభైరవ, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించిన ఈ సాంగ్‌కి కాసర్ల శ్యామ్ అద్భుతమైన లిరిక్స్‌ని రాశారు. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాస్టర్ డ్యాన్స్ మూమెంట్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. నాగబంధం సినిమా 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News