Monday, December 23, 2024

నాగచైతన్యకు సమంత గుర్తుకొచ్చిందేమో…

- Advertisement -
- Advertisement -
వారిద్దరూ 2017లో ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు, కానీ 2021 అక్టోబర్ 2న విడిపోయినట్లు ప్రకటించారు.

హైదరాబాద్: ‘ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో, ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో తెలియదు. కానీ కొందరి జ్ఞాపకాలు ఎప్పుడూ మనస్సులో నిలిచిపోయి గుర్తుకొస్తుంటాయి. ఇప్పుడు నాగచైతన్య పరిస్థితి కూడా అదే. ఆయన వారిద్దరూ నటించిన ‘ఏ మాయ చేశావే’ సినిమా 13వ వార్షికోత్సవం వివరాలు పంచుకున్నారు. ఆ రోమాంటిక్ డ్రామా హిట్ సినిమా గురించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సమంత రుత్ ప్రభు నటించిన ఆ సినిమా బాగా హిట్ అయింది. గమ్మతేమిటంటే నాగచైతన్య తన మాజీ భార్య సమంత ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. కానీ సమంత మాత్రం సోషల్ మీడియాలో కేవలం తన కేరీర్ గురించి మాత్రమే పంచుకుంది. వేదాంత ధోరణిలో తన మనస్సులోని మాటలని పెట్టింది. ‘నేను వయస్సు పెరిగిపోతున్నకొద్దీ…దేవుని(ఫాదర్) సన్నిధికి వెళ్లినప్పుడు…నాపై కురిపించిన ప్రేమ, అనురాగాలకు కృతజ్ఞతతో ఫీలవుతుంటాను. ప్రతి కొత్త రోజుకు, మంచి చేసినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. నన్ను చాలా విషయాలు ప్రభావితం చేశాయి. అవి ఇప్పుడు ప్రభావితం చేయడంలేదు. కేవలం ఓ ప్రేమ, కృతజ్ఞతల అల మాత్రమే ప్రతిరోజు. థ్యాంక్యూ’ అని రాసుకొచ్చింది. ఆ భావాలు చూస్తుంటే ఏమిటీ వేదాంతం, ఏమిటీ వైరాగ్యం అనిపిస్తుంది. ‘ఏ మాయ చేశావే’లో సమంత నటన గొప్పగా ఉంటుంది.

A Maya chesave

ప్రస్తుతం సమంత ‘సిటాడెల్’ అనే వెబ్ సీరీస్‌లో నటిస్తోంది. ఆమెకు జంటగా వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియోలను సమంత పోస్ట్ చేస్తోంది. కాగా నాగచైతన్య తెలుగు,తమిళ్ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ పూర్తిచేసుకున్నాడు. దానికి వెంకట ప్రభు దర్శకత్వం చేశారు. నాగచైతన్యకు జంటగా కృతి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్ చేసింది.

Samanta wrote

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News