Thursday, January 23, 2025

నాగచైతన్య ‘తండేల్’ సినిమా డిజిటల్ రైట్స్ అమ్మకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగచైతన్య, సాయి పల్లవి నటిస్తున్న సినిమా ‘తండేల్’ ఇంకా షూటింగ్ లో ఉండగానే డిజిటల్ రైట్స్ రూ. 40 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కు అమ్ముడుపోయింది. ఈ విషయాన్నినిర్మాతలు ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.  ఈ సినిమాలో నాగచైతన్య శ్రీకాకుళం మత్స్యకారుడిగా నటిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లకు రానున్నది. సాయిపల్లవి నాగచైతన్యతో నటిస్తున్న రెండో చిత్రం ఇది.

‘తండేల్’ సినిమా యథార్థ గాధ ఆధారంగా తీస్తున్న సినిమా. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కథ విషయం గురించి నాగచైతన్య వివరిస్తూ ఇది 2018 సంవత్సరం ఉదంతానికి సంబంధించిన చిత్రమని, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం కు చెందిన మత్స్యకారులు పొరపాటున పాకిస్థాన్ సముద్ర జలాలలోకి వెళ్లి పట్టుబడిపోతారని వివరించారు. ‘ఇలాంటి పాత్రను నేను ఇదివరకు ఎన్నడూ చేయలేదు’ అని నాగచైతన్య తెలిపారు. శ్రీకాకుళం మత్స్యకారులు సాధారణంగా గుజరాత్ వరకు చేపల వేటకు వెళతారు. కానీ ఒకసారి పొరపాటున వారు పాకిస్థాన్ జలాలలోకి వెళ్లిపోవడంపై కథ నడుస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News