Thursday, January 23, 2025

ఐదోసారి నాగా సిఎంగా రియో రికార్డు

- Advertisement -
- Advertisement -

కోహిమా : నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ ఉద్ధండుడు నెయిఫియూ రియో రికార్డు స్థాయిలో అయిదోసారి ముఖ్యమంత్రి కానున్నారు. నాగాలాండ్‌లో సుదీర్ఘకాల సిఎంగా ఉంటూ వస్తున్న ఆయన వరుసగా మరో విజయంతో ఐదోసారి ఈ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రియో సొంతపార్టీ ఎన్‌డిపిపి మిత్రపక్షం బిజెపితో కలిసి 60 స్థానాల అసెంబ్లీలో 33 స్థానాలలో విజయం సాధించింది. ఇటీవలి కాలంలో రాష్ట్రాలలో వరుసగా ఒకే పార్టీ లేదా కూటమి విజయం సాధించడం, ఏకబిగిన ఒక నేత ఐదు సార్లు సిఎం కావడం అరుదైన రికార్డు అయింది. వయోవృద్ధ నేత అయిన రియో నాగాలాండ్‌లో ఇంతకు ముందు మూడుసార్లు సిఎం అయిన ఎస్‌సి జమీర్ రికార్డును బద్ధలు కొట్టారు.

1950 నవంబర్ 11న అంగామీ నాగా కుటుంబంలో జన్మించిన రియో తొలి దశ విద్యాభ్యాసం కోహిమా బాప్టిస్టు ఇంగ్లీషు స్కూల్‌లో సాగింది. తరువాత పశ్చిమ బెంగాల్‌లోని పురులియా లో ఉన్న సైనిక్ స్కూల్‌లో చదువు కొనసాగించారు. తరువాత డార్జిలింగ్‌లోని సెయింట్ జోసెఫ్ కాలేజీ, తిరిగి కోహిమా ఆర్ట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్కూల్ దశలోనే ఆయన రియో విద్యార్థి నేతగా తన ప్రాభవం సాగించారు. 1974లో ఆయన యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ యువజన విభాగం అధ్యక్షులుగా కోహిమా జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. తరువాత ఏకంగా నాగాలాండ్ యువజన విభాగం అధ్యక్షులు అయ్యారు. ఇప్పటివరకూ ఆయన ఎనిమిది సార్లు రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేశారు. ఇందులో 1987లో ఒక్కసారే ఓటమి పాలయిన సందర్భం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News