Thursday, January 23, 2025

కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది: నాగం జనార్దన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనకు ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాగం జనార్దన్ రెడ్డికి పార్టీ ప్రకటించిన లిస్టులో పేరులేదు, వేరే అభ్యర్థికి పార్టీ టికెట్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి అసమ్మతి వాదులు నిరసన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ తనకు టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చారని, తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను బిఆర్‌ఎస్, బిజేపి నాయకులు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, కార్యకర్తలతో చర్చింది నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News