Friday, December 20, 2024

బిఆర్ఎస్ లో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణవర్ధన్ రెడ్డిలు బిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో మంగళవారం సిఎం కెసిఆర్ సమక్షంలో వీరిద్దరితోపాటు పలువురు నేతలు బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్.. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం కెసిఆర్ మాట్టాడుతూ.. నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలను పార్టీలోకి తానే ఆహ్వానించానన్నారు. పిజేఆర్ తనకు వ్యక్తిగత మిత్రుడని.. విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్తు తన బాధ్యత అని అన్నారు. గతంలో నాగం జనార్ధన్ రెడ్డి, తాను కలిసి పనిచేశామని.. పోరాటం చేశామని తెలిపారు. నాగం సలహాలు, సూచనలు తీసుకుని 14 నియోజకవర్గాలు గెలవాలని చెప్పారు. మాగంట గోపినాథ్, విష్ణువర్థన్ రెడ్డి కలిసి సమన్వంతో పనిచేయాలని కెసిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News