Monday, December 23, 2024

మార్కండేయ ఎత్తిపోతల పథకం వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు: జిల్లాలోని బిజినేపల్లి మండలం లోని మార్కండేయ ఎత్తిపోతల పథకం వద్ద ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. వివరాలలోకి వెళితే.. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ పనుల పురోగతినీ పరిశీలన కోసం వెళ్ళిన కాంగ్రెస్ బృందం తో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్య కర్తలు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలు ఒకరినోకరు కొట్టుకోడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి ఆవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మొహరించారు. ఈ ఘర్షణ లో గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు కారణమైన ఇరువర్గాల కార్య కర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News