Monday, December 23, 2024

కాంగ్రెస్‌కు నాగం హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో రోజురోజుకు టికెట్‌ల పంచాయితీ ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ తనకే ఇవ్వాలంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. గురువారం తన అనుచరులతో నాగం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ టికెట్‌ను తనకే ఇవ్వాలని, కూచుకుల్ల దామోదర్ రెడ్డి వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

బిఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన ఎంఎల్‌సి పదవి నాలుగున్నర సంవత్సరాలు పెట్టుకొని తన కొడుకును కాంగ్రెస్‌లో ఎంఎల్‌ఎ చేయాలని కూచుకుల్ల దామోదర్‌రెడ్డి కలలు కంటున్నాడని నాగం ఆగ్రహం వ్యక్తం చేశారు. కూచుకుల్ల దామోదర్‌రెడ్డిని ఆయన కొడుకును నియోజకవర్గంలో ఎవరు గుర్తుపట్టరని, తనను తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టని వారు ఉండరని ఆయన తెలిపారు. అధిష్టానం తనకు రాజ్యసభ ఇస్తుందని, అందుకు తాను అంగీకరించానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టికెట్ తనకే ఇవ్వాలని, టికెట్ విషయంలో తేడా వస్తే తన సత్తా ఏమిటో చూపిస్తానని నాగం కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చరించా రు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నానని తనకు టికెట్ ఇవ్వకపోతే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News