Monday, December 23, 2024

కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన నాగం, విష్ణు

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి రెండు జాబితాలలో తమకు చోటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసమ్మతి ప్రకటించిన ఆ పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, పి విష్ణువర్ధన్ రెడ్డి తమ అనుచరులతో కలసి మంగళవారం భారత రాష్ట్ర సమితిలో చేరారు.

ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు సమక్షంలో వీరు ఆ పార్టీలో చేరారు. వీరితోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొత్త జైపాల్ రెడ్డి కూడా బిఆర్‌ఎస్‌లో చేరారు. తమ రాజకీయ భవిష్యత్తుపై కెసిఆర్ నుంచి భరోసా తీసుకున్న ఈ అసంతృప్త నేతలు మరో నెలరోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు ప్రకటించి అధికార బిఆర్‌ఎ౮స్ కండువా కప్పుకోవడం విశేషం.

నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించి నాగం జనార్దన్ రెడ్డి భంగపాటుకు గురికాగా జూబ్లీ హిల్స్ స్థానం తనకే దక్కుతుందని ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి నిరాశ మిగిలింది. జూబ్లీ హిల్స్ టిక్కెట్‌ను మాజీ క్రికెటర్ ఆజారుద్దీన్‌కు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి సోదరి విజయకు ఖైరతాబాద్ స్థానాన్ని కేటాయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News