Friday, December 20, 2024

ప్రేమ వివాహం… సోదరిపై కత్తితో దాడి చేసిన సోదరుడు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూలు: ప్రేమ వివాహం చేసుకుందని సోదరిపై సోదరుడు కత్తితో దాడి చేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గుంపన్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అఖిల్‌కు అఖిల అనే చెల్లెలు ఉంది. వారం రోజుల క్రిత అఖిల ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో సోదరిపై సోదరుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News