Wednesday, January 22, 2025

అచ్చంపేటలో ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని బల్మూరు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. జింకట గ్రామానికి చెందిన మహేష్, భానుమతి అనే ప్రేమ జంట సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమజంట వారి వ్యవసాయ పొలంలో శనివారం సాయంత్రం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనా? లేక అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News