Sunday, January 19, 2025

నాగర్ కర్నూల్‌లో సొంత చెల్లిని గర్భవతి చేసిన సోదరుడు

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్: సొంత చెల్లిని సోదరుడు గర్భవతిని చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ గ్రామంలో ఓ మహిళకు కూమారుడు, కూతురు ఉన్నారు. 13 ఏళ్ల వయసు ఉన్న తన సొంత చెల్లికి మాయ మాటలు చెప్పి కామంతో కళ్లు మూసుకొనిపోయి ఆమెను లొబరుచుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. అతడు తన చెల్లి తీసుకొని వనపర్తి గోపాలపట్నం మండల బుద్ధారం అటవీ ప్రాంతంలో తిరిగారు. ఖిల్లగనపురంలో ఇద్దరు నడుచుకుంటే వెళ్తుంటే స్థానికులకు అనుమానం వచ్చి 1098 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. చైల్డ్ లైన్ అధికారులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బిజినపల్లి పోలీస్ స్టేషన్‌కు కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News