మంటల్లో కాలి గుర్తు తెలియని వ్యక్తి మృతి
మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల ఎంపిడిఒ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంపిడిఒ కార్యాలయం పక్కనే నిల్వ ఉంచిన తెలంగాణ ఫైబర్ ఆఫీస్ కు సంబంధించిన పైపులకు మంటలు అంటుకోవడంతోనే ఎంపిడిఒ కార్యాలయం లో కూడా అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పాత సామాగ్రి భద్రపరిచిన గదిలో ఈ మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అనంతరం పరిశీలించగా 50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడినట్టు సమాచారం. ఎంపిడిఒ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస తెలిపారు. ఎంపిడిఒ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బిజినేపల్లి ఎంపిడిఒ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -