Tuesday, January 7, 2025

నాగర్ కర్నూల్ లో లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

కోదాడ జడ్చర్ల హైవేపై రోడ్డు ప్రమాదం
కాంక్రీట్ మిక్సర్ లారీని ఢీకొన్న కారు
ఇద్దరు మృతి

మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామ పరిధిలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.  లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…   కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారి167పై టిప్పర్ లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరి యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన గణేష్(28), తాండ్ర గ్రామానికి చెందిన కేతమళ్ల రామకోటి(35) గా పోలీసులు గుర్తించారు. మృతులు చారకొండ నుండి స్వగ్రామమైన కొట్రకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. అతివేగంతో టిప్పర్ లారీని ఓవర్ టేక్ చేయబోతుండగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News