Thursday, December 19, 2024

కూలీ పనికి తీసుకెళ్లి.. ఇద్దరు మహిళలకు మద్యం తాగించి… అత్యాచారం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: ఇద్దరు మహిళలను కూలీ పనులకు తీసుకెళ్లి వాళ్లకు బలవంతంగా మద్యం తాగించి అనంతరం వారిపై ఇద్దరు అత్యాచారం చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని హాజీపూర్ శివారు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అచ్చంపేటలో ఇద్దరు మహిళలు రోజు వారి కూలీ కోసం అడ్డాకు వచ్చారు. వినోద్ సింగ్, గజానంద సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు మహిళల వద్దకు వచ్చి ఇంట్లో పని ఉందని వారిని తీసుకెళ్లారు. ఇద్దరు మహిళలు ఇళ్లును శుభ్రం చేసిన తరువాత వారిని మాటల్లో దింపి కారులో నల్లగొండ జిల్లాలోని డిండి వైపుకు తీసుకెళ్లారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిలోని హాజీపూర్ సమీపంలో మహిళలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.

మహిళలకు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం వారు మత్తులోకి జారుకున్న తరువాత వారిపై ఇద్దరు అత్యాచారం చేశారు. అదే కారు సాయంత్రం అచ్చంపేట శివారులో మహిళలను వదిలి వెళ్లిపోయారు. స్థానికుల సహాయంతో ఇద్దరు మహిళలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మహిళలను ఆరోగ్య పరీక్షల నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. బాధితులు బల్మూరు మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News