Friday, December 20, 2024

మంత్రి మల్లారెడ్డికి నాగారం బీఆర్‌ఎస్ నేతల సంఘీభావం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కీసరః మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసాలు, సంస్థలపై ఇటీవల ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో నాగారం మున్సిపల్ బీఆర్‌ఎస్ నాయకులు శనివారం మంత్రితో పాటు బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీఆర్‌ఎస్ నేతలను లక్షంగా చేసుకొని ధర్యాప్తు సంస్థలతో ఇబ్బందులు పెడుతుందని, బీజేపీ జేబు సంస్థలుగా మారిన ఐటీ, ఈడీ సోదాలకు బెదరబోమని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్ శ్రేణులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ప్రజలే బీజేపీకి బుద్ది చెస్తారని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో నాగారం మున్సిపల్ చైర్ పర్సన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్ పర్సన్ బండారి మల్లేష్ యాదవ్, నాగారం పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షులు తేళ్ల శ్రీధర్, కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్ గౌడ్, ఎస్.శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు కె.దయాకర్‌రావు, కె.కృష్ణారెడ్డి, ఎం.జగన్మోహన్‌రెడ్డి, కె.సుధాకర్‌రెడ్డి, ఎ.శ్రీనివాస్, బి.శ్రీకాంత్ యాదవ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News