Thursday, September 19, 2024

నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగార్జున సాగర్ నీటి ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ సామర్థం 312.5 టిఎంసిలుండగా ప్రస్తుత నీటి నిల్వ 152.57 టిఎంసిలుగా ఉంది. సాగర్ ఇన్‌ఫ్లో 2.19 లక్షల క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 15,111 క్యూసెక్కులుగా ఉంది.
జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.75 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి 2.8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లుకాగా ప్రస్తుతం 317.69 మీటర్లకు చేరుకుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టిఎంసిలుకాగా ప్రస్తుతం నీటి నిల్వం 8.01 టిఎంసిలుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News