Wednesday, January 22, 2025

రజనీకాంత్ సినిమాలో నాగార్జున

- Advertisement -
- Advertisement -

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రస్తుతం తన ఎల్‌సియు నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్‌కి 171వ మూవీ. ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరింత స్టార్ పవర్‌ను జోడించడానికి, మేకర్స్ కింగ్ నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించినట్లు ఆయన పుట్టినరోజున ప్రకటించారు.

నాగార్జునను సైమన్‌గా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆయన డైనమిక్ అవతార్‌ను చూపించింది. స్టైలిష్ షేడ్స్‌లో మెరుస్తున్న గోల్డ్ వాచ్‌తో కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. నాగార్జున చేరికతో స్టార్ పవర్ నెక్స్ లెవల్ కి వెళ్ళింది. రజనీకాంత్, నాగార్జున అభిమానులకు ఇది గ్రేట్ ట్రీట్. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.

బర్త్‌డే గిఫ్ట్‌గా…

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్- అవార్డ్- విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మోస్ట్- వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర. లీడ్ రోల్స్‌తో సహా రష్మిక మందన్న పాత్రని పరిచయం చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో నాగార్జున న్యూ లుక్‌లో, స్టైలిష్‌గా ఎదురుగా ఉన్నవారికి ఆప్యాయంగా పలకరిస్తూ కనిపించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న కుబేర… తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టిలింగ్వల్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News