Thursday, January 23, 2025

యాక్షన్ విషయంలో షాక్ అవుతారు

- Advertisement -
- Advertisement -

 

Bangarraju cinema release on sankranthi

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ’ది ఘోస్ట్’. పవర్‌ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు.

ఈ చిత్రం దసరా కానుకగా బుధవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో కింగ్ నాగార్జున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ది ఘోస్ట్ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బావుంటుంది. తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చింది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా చూపించారు.

యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్ సిస్టర్ బాండ్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను. ఒక యాక్షన్ మూవీలో ఎమోషన్ ఈ స్థాయిలో పండటం నాకే షాక్ అనిపించింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటికి వచ్చినపుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలవుతారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది. ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ మెయిన్ హైలెట్. హీరోయిన్ సోనాల్ చౌహాన్ పాత్ర చాలా పరిణితితో వుంటుంది. హీరో, హీరోయిన్ మధ్య రిలేషన్ చాలా కొత్తగా వుంటుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News