Sunday, January 5, 2025

‘బ్రహ్మాస్త్ర’ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్..

- Advertisement -
- Advertisement -

భారీ ఫాంటసి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘నంది అస్త్ర’ అనే శక్తి ఉన్న అనీష్ శెట్టి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా నాగార్జునకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవల రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ… ఎస్.ఎస్.రాజమౌళితో కలిసి ‘బ్రహ్మాస్త్రం’ సినిమా ప్రచారంలో భాగంగా విశాఖపట్నం నగరాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. కాగా, ఈనెల 15న సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Nagarjuna first look out from ‘Brahmastra’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News