- Advertisement -
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీ వరద వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు నుంచి 89వేల క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్‌కు వస్తున్నాయి. ఇప్పటికే సాగర్ జలాశయం నిండిపోవడంతో అధికారులు.. ప్రాజెక్టు 6 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 48,540 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ కాల్వలు, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎస్ బిసి, వరద కాల్వ ద్వారా మరో 40వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 589 అడుగుల మేర నీటిమట్టం ఉంది.
- Advertisement -