- Advertisement -
హైదరాబాద్ : నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. బుదవారం రెండో రోజు 7 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీ రోహిత్ సింగ్ తెలిపారు. మంగళవారం ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 27,28,29 తేదీలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లకు అవకాశం ఉండదు. 30వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. 31 నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు వుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటించనున్నారు. అభ్యర్థుల నామినేషన్లు దాఖాలు చేసేందుకు 3 రోజులో గడువు ఉంది. దీంతో రేపు సాగర్ ఉపఎన్నికకు భారీగా నామపత్రాలు దాఖలయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.
nagarjuna sagar assembly by election
- Advertisement -