మొదటి రోజు ఐదు నామినేషన్లు
మంచి రోజు చూసుకొని ప్రధాన పార్టీలో
నామినేషన్ దాఖలకు ఏర్పాట్లు
కరోనా నేపథ్యంలో నామినేషన్ వేసే
సమయంలో అభ్యర్థితో పాటు
ఒకరికి అనుమతి
మన తెలంగాణ/ హాలియా: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు మంగళవారం మొదటి రోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నోముల నర్సింహ్మయ్య హఠాన్మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సారి సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీ కృషి చేస్తుండ గా, విజయం సాధించే ందుకు కాంగ్రెస్, బిజె పి నాయకులు చాపకింద నీరు లు ప్రయత్నా లు ముమ్మరం చేశారు. నా మినేషన్లకు మొదటి రోజు మంగళవారం కావడంతో ప్ర ధాన పార్టీల అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చే యలేదు. మం చిరోజు చూసుకొని కాంగ్రెస్, బిజెపి, టిఆర్‌ఎస్, టిడిపి, డిఎస్‌పి, ఎంఎస్‌పి, జైమహాభారత్ పార్టీ అభ్యర్థులు నా మినేషన్లు దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కరో నా నేపథ్యంలో నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఒకరికే అనుమతించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అ భ్యర్థి జానారెడ్డిని ప్రకటించగా, అధికార టిఆర్‌ఎస్, బిజె పిలు తమ అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయకుండానే మండలానికి ఇద్దరి చొప్పున ఎ మ్మెల్యేలను ఇన్‌చార్జిలుగా నియమించి ప్రచార ప ర్వంలో దూసుకపోతుండ గా, బిజెపి నాయకులు మాత్రం ఆశావాహుల కోసం మెరుగైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నెలాఖరు వరకు నామినేషన్‌కు చివరి తేది కానుంది. ఏప్రిల్ ౩న అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేది కాగా, ఏప్రిల్ 17న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు జీవన్మారణ సమస్య కావడంతో ప్రధాన పార్టీలు గెలుపొందేందుకు తమతమ పార్టీల వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారాలు వేడెక్కనున్నాయి.