Sunday, January 19, 2025

సాగర్ 26 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Nagarjuna Sagar Project 26 Gates Opened

మనతెలగాణ/హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరదపోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా గురువారం ఉదయానికే పూర్తి స్థాయిలో నిండిపోయింది. దీంతో సాగర్ 26గేట్లు పది అడుగుల మేరకు ఎత్తివేసి స్పిల్ వే ద్వారా రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను ప్రారంభించారు. ఉదయం 6గంటలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 2.93లక్షల క్యూసెక్కుల నీరు చేరుతున్నట్టు రికార్డు కాగా, ప్రాజెక్టులో నీటిమట్టం 586అడుగుల వద్ద 304టిఎంసీలకు చేరుకుంది. రిజర్వాయర్‌లో 7టిఎంసీల మేరకే ఖాళీ ఉండేది. మద్యాహ్నాం 12గంటలకు సాగర్‌లోకి నీటి ప్రవాహం 3.48లక్షల క్యూసెక్కులకు పెరిగిపోయింది. నీటిమట్టం 588అడుగుల వద్ద నీటి నిలువ 306టిఎంసీలకు చేరుకుంది. సాయంత్రం ఆరు గంటలకు సాగర్ జలాశయంలోకి వరద ప్రవాహ ఉధృతి మరింతగా పెరిగిపోయింది. ఎగువ నుంచి 4.22లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, ప్రాజెక్టు గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. 2009లో నాగార్జున సాగర్‌కు భారీ వరదల దృష్టా 26గేట్లు తేరిచారు. తిరిగి 13ఏళ్ల తరువాత నాగార్జున సాగర్ 26గేట్లు తెరుచుకున్నాయి. సాగర్‌లో 590అడుగుల గరిష్ట స్థాయి నీటిమట్టానికి గాను 588అడుగుల వద్ద 306టీఎంసీల నీరు నిలువ వుంది. ప్రాజెక్టులో 2శాతం కుషన్ ఉంచి వరద ప్రవాహాన్ని నియంత్రించే చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. సాగర్ నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు. దీంతో పులిచింతల దిగువన నదికి ఇరువైపులా ఉన్న లోతట్టు సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సాగర్ నుంచి విడుదలయ్యే నీరు నేరుగా ప్రకాశం బ్యారేజికి చేరుతుండటంతో గుంటూరు, కృష్ణాజిల్లా ల అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజికి దిగువన నగర పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీశైలంకు భారీగా వరద
ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది.ఎగువన జూరాల ప్రాజెక్టులోకి 2.47లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టు నుంచి దిగువకు 2.22లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నదుల ద్వారా శ్రీశైలం జలాశయంలోకి ఉదయం 6గంలకు 3.71లక్షల క్యూసెక్కులు ఉన్న వరద ప్రవాహం మధ్యాహ్నం 12గంటలకు 4.21లక్షల క్యూసెక్కుల నీరు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు 10రేడియల్ గేట్లు 15అడుగుల మేరకు ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి 4.38లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఇందులో కుడి ఎడమ గట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలనుంచి విద్యుత్ ఉత్పతి అనంతరం 50,460క్యూసెక్కల నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి855అడుగులకు గాను 884అడుగుల వద్ద 212టిఎంసీల నీరు నిలువ ఉంది. సాయత్రం 6గంటలకు కూడా వరదప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం 3టింసీల మేరకు కుషన్ ఉంచి వరద ప్రశాహాన్ని నియంత్రిస్తున్నారు.

Nagarjuna Sagar Project 26 Gates Opened

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News