Friday, January 10, 2025

సాగర్ జలాలు విడుదల..

- Advertisement -
- Advertisement -

వేంసూరు: వేంసూరు మండలం లో సాగర్ జలాలు విడుదల చేయడం తో మండల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఆయ కట్టు కింద, లంక సాగర్‌ ఆయకట్టు కింద పంట పొలాలు వేలాది ఎకరాలు ఉన్నాయి. ఈ ఆయకట్టు కింద వేసిన వరి పంట, పండటం తో రైతులు మరల వరి పంట వేసే పని లో ఉన్నారు. దుక్కులు దున్ను కొని, పోలాలకు నీరు పెట్టు కుని సిద్ధం చేసుకుంటున్నారు. అదే విధంగా మరి కొంత మంది రైతులు, జొన్న, మొక్క జొన్న, పత్తి పంట, మిర్చి, కూర గాయాల సాగు చేస్తున్నారు. సాగర్ జలాలు, విడుదల చేయడం, లంకా సాగర్ జలాలు కూడా,అందుతుండటం, తో రైతులు వరి పంట, వేసే పనిలో నిమగ్నమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News